Tuesday, January 21, 2025

టార్చర్ పెట్టిన భార్యను చంపేసిన భర్త?

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ భర్త భార్యను చంపి చెరువులో పడేశాడు. జనవరిలో భార్యను భర్త హత్య చేసి చెరువులో పడేశాడు. విడాకులు ఇవ్వకుండా టార్చర్ చేసినందుకే హత్య చేశానని భర్త ఒప్పుకున్నాడు. విడాకులు ఇస్తే డబ్బులు కూడా ఇస్తానని చెప్పానని, పద్మ తనని చిత్రహింసలు పెట్టిందని భర్త వేణుగోపాల్ ఆరోపణలు చేశాడు. మహిళా పిఎస్‌కు వెళ్లి తనపై తప్పుడు కేసులు పెట్టడంతో ప్రతీకారం తీర్చుకున్నానన్నారు. కాపురానికి రాకుండడమే కాకుండా విడాకులు ఇవ్వకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డానని భర్త ఒప్పుకున్నాడు. రూ.20 లక్షల కట్నం ఇచ్చామని పద్మ తండ్రి తెలిపాడు. మా అమ్మాయికి పెట్టిన బంగారం కూడా అల్లుడు అమ్మేశాడని వాపోయింది. అల్లుడు వేణుగోపాల్‌ను కఠినంగా శిక్షించాలని పద్మ తండ్రి డిమాండ్ చేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News