Wednesday, January 22, 2025

వంట కోసం భార్యను చంపి…. ఉరేసుకున్న భర్త

- Advertisement -
- Advertisement -

లక్నో: వంట త్వరగా చేయలేదని భార్యను భర్త హత్య చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లా థంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రేమాదేవి(28), పరుశురామ్(30) అనే కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనుల కోసం బయటకు వెళ్లిన పరుశురామ్ ఇంటికి వచ్చిన తరువాత అన్నం పెట్టమని అడిగారు. ఇంకా వంట చేయలేదని కొంచెం సేపు ఆగాలని భర్తకు భార్య తెలిపింది. ఇప్పుడు వరకు భోజనం వండలేదా? అని ఆమెపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దంపతుల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో పదునైన ఆయుధం తీసుకొని ఆమె తలపై బాదాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడే చనిపోయింది. భార్య చంపిన కేసులో జైలు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఇంట్లో గడియ పెట్టుకొని అతడు ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News