Thursday, January 23, 2025

ప్రేమపెళ్లి… గంజాయికి బానిస…. అడవిలో భార్యను కత్తితో పొడిచి

- Advertisement -
- Advertisement -

Husband killed wife in Love Marriage

చెన్నై: ప్రేమించాడు…. పెళ్లి చేసుకున్నాడు… గంజాయికి బానిస కావడంతో ఇద్దరు మధ్య గొడవలు జరిగాయి. దీంతో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి భార్యను భర్త కత్తితో పొడిచి చంపిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రెడ్ హిల్స్ లో మదన్, తమిళి సెల్వి కొంతకాలంగా ప్రేమించుకుంటన్నారు. మూడు నెలల క్రితం కుటుంబ సభ్యులను ఎదురించి ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. మదన్ గంజాయికి బానిస కావడంతో భార్యను పలుమార్లు వేధించాడు. రోజుకు రోజుకు ఇద్దరు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. జూన్ 25న గంజాయి మత్తులో భార్యను కైలాసకోనకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు మధ్య గొడవ జరగడంతో కత్తితో పొడిచి అక్కడి నుంచి అతడు వెళ్లిపోయాడు. తమిళి సెల్వి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మదన్ ను అదుపులోకి తీసుకున్నారు. తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. కైలాసకోనకు తీసుకెళ్లి మృతదేహాం వెతకగా కనిపించలేదు. గంజాయి మత్తులో ఉన్నానని సరైన స్థలంపై అవగాహన లేదన్నాడు. 35 రోజుల తరువాత తమిళి సెల్వి బూట్లు, దుస్తువులు, మెట్లు పాదరక్షకాలు లభించాయని ఎస్ఐ రమేష్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News