Wednesday, January 22, 2025

భార్యతో వివాహేతర సంబంధం… హత్య… నిందితుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని
హత్య చేసిన నిందితుడు
అరెస్టు చేసిన తుకారాంగేట్ పోలీసులు
వివరాలు వెల్లడించిన నార్త్‌జోన్ ఎడిసిపి వెంకటేశ్వర్లు

 

మన తెలంగాణ/సిటిబ్యూరో: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కక్షతో హత్య చేసిన నిందితుడిని తుకారాంగేట్ పోలీసులు అరెస్టు చే శారు. నార్త్‌జోన్ ఎడిసిపి వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో బుధవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మణిపూర్ రాష్ట్రం, ఇంపాల్, జిరిబాంకు చెందిన దీపెందు బిస్వాస్(23) సికింద్రాబాద్ తు కారాంగేట్, సాయినగర్‌లో ఉంటు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. మణిపూర్‌కు చెందిన ప్రియజిత్ నామసుంద్ర(21) తుకారాంగేట్‌లో ఉంటూ కూలీ పనిచేస్తున్నాడు.

ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు, కాగా దీపెందు నాలుగేళ్ల క్రితం కుంటుంబంతో కలిసి వచ్చి నగరంలో ఉంటున్నాడు. తర్వాత ప్రియజిత్ నామసుంద్ర ఇక్కడి రావడంతో పక్కపక్కనే ఉంటున్నారు. ప్రియజిత్ భార్యతో దీపెందు బిస్వాస్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ప్రియజిత్‌కు తెలియడంతో చాలా సార్లు మందలించాడు ఇచ్చాడు. తన భా ర్యతో సన్నిహితంగా ఉండవద్దని హెచ్చరించాడు. అయినా కూడా దీపెందు వినకపోవడంతో గత నెల 25వ తేదీన ఇద్దరు కలిసి మద్యం తాగేందుకు త్రిమూర్తి కాలనీలోని నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు వెళ్లారు.

అక్కడ ఇద్దరు కలిసి మద్యం తాగారు, దీపెందుకు ఫుల్‌గా మద్యం తాగించిన తర్వాత కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితులు అక్కడి నుంచి వచ్చి మణిపూర్‌కు పారిపోయాడు. దీపెందు కన్పించకపోవడంతో కుటుంబ సభ్యులకు తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని మణిపూర్, ఇంపాల్‌లో అరెస్టు చేసి నగరానికి ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకుని వచ్చారు. ఎస్సై ప్రశాంత్ తదితరులు నిందితుడిని పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News