Wednesday, January 22, 2025

దూరం పెడుతోందని అంతమొందించాడు

- Advertisement -
- Advertisement -

మొయినాబాద్: అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ తన ను దూరం పెడుతోందని ఆగ్రహంతో పక్కా పథకం ప్రకారం దారుణంగా హత్య చేసిన సంఘటన మొయినాబాద్‌లో కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీ అనే మహిళ గత నాలుగేళ్ల క్రితం బ్రతుకుదెరువుకోసం మొయినాబాద్‌కు వలస వచ్చి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో హనుమంతు అనే వ్యక్తితో పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసిందన్నారు. గత ఎనిమిది నెలల క్రితం మృతురాలి భర్త అనారోగ్యంతో మృతి చెందాడని, దీంతో వారి స్వగ్రామానికి వెళ్లినట్లు తెలిపారు.

రెండు నెలల అనంతరం లక్ష్మీ ఆరోగ్యం సైతం క్షీణించడంతో ఆమె హైదరాబాద్‌లో చికిత్స తీసుకుందని, తిరిగి మొయినాబాద్‌లోని ముస్లిం బస్తీలో ఇంటిని అద్దెకు తీసుకొని కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుందన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హనుమంతు అనే వ్యక్తి లక్ష్మీ ఇంటికి చేరుకొని తనను ఎందుకు దూరం పెడుతున్నావని ఆగ్రహించాడని, తన ఆరోగ్యం సరిగాలేదని లక్ష్మీచెప్పడంతో ఆగ్రహానికి గురైన హనుమంతు లక్ష్మీపై దాడి చేసి ఆమె చీరను మెడకు బిగించి హత్య చేశాడని పేర్కొన్నారు.

గొడవ జరుగుతున్న విషయాన్ని లక్ష్మీ తన చిన్నకుమార్తె మంజుశ్రీకి ఫోన్ చేసి చెప్పిందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News