Wednesday, January 22, 2025

భీమా డబ్బు కోసం భార్యను చంపించిన భర్త

- Advertisement -
- Advertisement -

జైపూర్: రూ 1.9 కోట్ల భీమా డబ్బు కోసం భార్యను రోడ్డు ప్రమాదంలో భర్త చంపించిన సంఘటన రాజస్తాన్ రాష్ట్రం జైపూర్‌లో జరిగింది. పోలీసులు భర్తతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మహేష్, శల్లు అనే దంపతులు మధ్య గొడవలు జరుగుతుండడంతో వేర్వేరుగా ఉంటున్నారు. గతంలో కట్నం పేరుతో తనని వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్‌లో భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. 2019లో వరకట్నం కేసులో మహేష్ జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తరువాత తన భార్య శల్లు, మహేష్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు. బాలాజీ దేవాలయాన్ని 12 సార్లు దర్శనం చేసుకుంటే సంతోషమైన దాంపత్యం జీవితం వస్తుందని మహేష్ తన భార్యకు చెప్పాడు.

దీంతో ఆమె కజిన్ రాజుతో కలిసి హర్మాదా ప్రాంతంలో ఉన్న షామోద్ గుడికి ద్విచక్రవాహనం వెళ్తుండగా అదే సమయంలో ఫోన్ లోకేష్ ఆధారంగా ఆమె ఎక్కడ ఉందో గుర్తించాడు. ప్లాన్ ప్రకారం రౌడీ షీటర్ ముఖేష్ సింగ్ రాథోర్‌కు ఆమెను చంపాలని తెలిపాడు. ఎస్‌యువి కారుతో ఆమె ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో శల్లు ఘటనా స్థలంలోనే చనిపోయింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శల్లు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి సిసి టివి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఆమె చనిపోయిన నాలుగు నెలల తరువాత శల్లు పేరు మీద ఉన్న డెత్ ఇన్సూరెన్స్ రూ 1.90 కోట్ల రూపాయలను మహేష్ తీసుకున్నాడు. పోలీసులకు అనుమానం రావడంతో మహేష్ మళ్లీ అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేయించానని ఒప్పుకున్నాడు.ఈ హత్యలో నిందితులుగా ఉన్న మహేష్, రాజు, ముఖేష్ సింగ్ రాథోర్, సోనూ సింగ్, రాకేష్ బైర్వాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News