Sunday, December 22, 2024

భార్య కత్తితో గొంతు కోసి.. భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

జవహర్‌నగర్ : అనుమానం,కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను కడతేర్చి తాను సైతం ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో చోటుచేసుకుంది. జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం జనగాం జిల్లాకు చెందిన బండరాజు(41), కవిత(36)దంపతులు తమ కూతురు, కుమారుడితో కలిసి రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. రాజు ఆటోడ్రైవర్‌గా పని చేస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత కొంత కాలంగా భార్య కవితపై అనుమానం పెంచుకున్న రాజు ఆమెతో ఘర్షణ పడుతు ఉండటంతో కుటుంబ సభ్యులు నచ్చచెప్పి చూశారు. అయినప్పటికి రాజులో ఎలాంటి మార్పు రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

కూతురు కాలేజి, కుమారుడు పాఠశాలకు వెళ్లగా భార్య భర్తల మధ్య గొడవ జరగగా భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేసి, తాను కూడా ఇంటి ఇనుప పైపుకు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు వీరి గొడవ విషయం తెలుసుకున్న కవిత తమ్ముడు సంఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకోని స్థానికుల సహాయంతో జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు. మల్కాజిగిరి డిసిపి రక్షితామూర్తి, కుషాయిగూడ ఇన్‌చార్జి ఎసిపి విజయ శ్రీనివాస్, క్లూస్‌టీం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోని పరిశీలించారు. కేసు నమోదు చేసుకోని మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి ధర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News