Wednesday, April 16, 2025

భార్యను రోకలి బండతో బాది చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

కాపురానికి రావడం లేదని కోపంతో అత్త ముందే రోకలి బండతో భార్యను కొట్టి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండల పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో సోమవారం చో చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల.. జిన్నారం మండల పరిధిలోని కిష్టాయిపల్లికి చెందిన రమీల (24)కు మూడేళ్ల క్రితం సురేశ్‌తో వివాహం జరిగింది. సురేశ్ ఇంద్రేశంలోని ఓ వెంచర్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి.

ఈ కారణంగా భార్య నెల క్రితం పెద్ద కంజర్లలో ఉంటున్న తన తల్లిగారింటికి పాపను తీసుకొని వచ్చి ఉంటోంది. సోమవారం సురేశ్ అత్తవారింటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. కోపంతో అక్కడే ఉన్న రోకలి బండతో భార్యపై దాడి చేశాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రమీల మృతి చెందింది. అడ్డువచ్చిన అత్త సైతం గాయాలపాలైంది. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పటాన్‌చెరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్త్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News