Wednesday, January 22, 2025

భార్య ఎవరితోనో ఫోన్ మాట్లాడటం చూసిన భర్త..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అనుమానమే పెను భూతమై ముగ్గురు ప్రాణాల మీదకి తెచ్చిన సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా ఐ. పోలవరం మండలం గుత్తిన దీవి గ్రామానికి జచెందిన నిచ్చెనకోళ్ల రామక్రిష్ణ స్థానికంగా ఉంటూ కొబ్బరి చెట్ల కాయలు దించే పని చేస్తుంటాడు. రామక్రిష్ణ కు ఏడు సంవత్సరాల క్రితం మండపేట మండలానికి చెందిన మహిళ తో విహవం జరిగింది. రామక్రిష్ణ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంత కాలంగా తన భార్య ఎవరితోనో మాట్లాడుతుందని రామక్రిష్ణ అనుమానం పెంచుకున్నాడు.

Also Read: నిరసన తెలుపుతున్న మల్లయోధులతో ప్రియాంక గాంధీ భేటీ!

కాగా శుక్రవారం భార్య అదేవిధంగా ఫోన్ లో మాట్లాడుతుండగా కోపంతో కొబ్బరి కాయలు కొట్టే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనను అడ్డుకొబోయిన అత్తపై కూడా రామక్రిష్ణ దాడి చేశాడు.ఈ ఘటనలో తల్లి కూతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం రామక్రిష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. దీంతో స్థానికులు ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వాడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News