Sunday, December 22, 2024

లవ్ మ్యారేజ్…. ఐదు రోజుల నుంచి భర్త కనిపించడంలేదని పిఎస్ లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: బయటకు వెళ్లిన భర్త రాకపోవడంతో భార్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం హమీద్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హమీద్ నగర్‌కు చెందిన ప్రణయ్ కుమార్ రెడ్డి, సాయిలత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడు నెలల క్రితం జీవనోపాధి నిమిత్తం అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని భవానీపురం కాలనీకి వచ్చారు. ఫిబ్రవరి 22 రాత్రి పది గంటల సమయంలో భార్యకు బయటకు వెళ్తున్నానని చెప్పి ప్రణయ్ వెళ్లాడు. రాత్రి 12 నుంచి తెల్లవారుజాము వరకు ఎక్కడ వెతికిన ప్రణయ్ ఆచూకీ కనిపించకపోవడంతో బంధువులను అడిగి తెలుసుకుంది. ఐదు రోజుల దాటినా జాడ తెలియకపోవడంతో సోమవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయిలత కుటుంబ సభ్యులు ప్రణయ్‌ను చంపి ఉంటారని అతడి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News