Wednesday, January 22, 2025

భార్య హత్య… పిఎస్‌లో లొంగిపోయిన భర్త… పోలీసులు వెళ్లేసరికి…

- Advertisement -
- Advertisement -

Man Murdered in Anantapur

గుంటూరు న్యూస్: భార్యను హత్య చేశానని ఓ భర్త పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి రక్తపుమడుగులో ఉన్న మహిళ నుంచి మూలుగుతున్న శబ్ధం రావడంతో వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీనివాసరావుపేటలో యలమందరావు, జగదీశ్వరీ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగదీశ్వరీ మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.

శుక్రవారం వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో డంబెల్ తీసుకొని ఆమె తలపై భర్త బాదాడు. ఆమె నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో చనిపోయి ఉంటుందని స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. సిఐ హైమారావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నాడు. సదరు మహిళ రక్తపు మడుగులో కనిపించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ నుంచి మూలుగుతున్నట్టు శబ్ధం రావడంతో వెంటనే ఆమెను 108లో జిజిహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె ప్రాణాలకు ముప్పులేదని వెల్లడించారు. భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News