Tuesday, November 5, 2024

భార్యను చంపేసి… పోలీసులకు ఫోన్ చేశాడు…

- Advertisement -
- Advertisement -

Husband murder wife in mahaboobabad

 

బయ్యారం: అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన నరేష్‌కు జయ్యారానికి చెందిన సరిత(28)ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 12 ఏళ్ల క్రితం పెళ్లి కావడంతో సిరివెన్నెల(10), మేఘన(6) పిల్లలు ఉన్నారు. నరేష్ డిసిఎం డ్రైవర్ గా పని చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యపై అనుమానం పెంచుకొని ఒక్క రోజు తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం తన భార్యను తీసుకెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తానని అత్తగారింటి నుంచి తన బైక్‌పై ఆమెను ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు నామాలపాడు అటవీ ప్రాంతానికి చేరుకొని వాహనం ఆపాడు. అనంతరం కత్తితో పలుమార్లు ఆమెను భర్త పొడిచాడు. గొంతు నులిమి హత్య చేసిన అనంతరం 100కు ఫోన్ చేసి తాను హత్య చేశానని చెప్పాడు. సిఐ తిరుపతి, ఎస్‌ఐ జగదీశ్ ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు అదుపులోకి తీసుకున్నారు. తనకు ఉరి శిక్ష వేసిన పర్వాలేదు కానా తన భర్య చనిపోయిందని తాను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని స్థానికులు అడినప్పుడు సమాధానం చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News