Friday, December 20, 2024

మిస్సింగ్ కేసు.. వెంకటాపురం చెరువులో మహిళ శవం

- Advertisement -
- Advertisement -

Husband murders Wife in Tirupati

తిరుపతి జిల్లా: మిస్సింగ్ కేసులో మహిళ శవం వెంకటాపురం చెరువులో తెలింది. భర్త వేణుగోపాల్ భార్యను హత్య చేసి ఆపై సూట్ కేసులో ఉంచి తాళం వేసి చెరువు పడవేసిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… సత్యనారాయణపురం కు చెందిన సాఫ్ట్ వేర్ వేణుగోపాల్ తో కొర్లకుంట కు చెందిన పద్మ కు వివాహం జరిగింది. కొంత కాలంగా భార్య భర్తల మధ్య వివాదం నెలకొనడం తో విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వేణుగోపాల్ కొన్ని నెలల క్రితమే భార్యను హత్య చేసి ఆపై మృతదేహాన్ని దాచిపెట్టాడు. అత్త, అల్లుడిని తన కూతురు జాడ చెప్పమని అడిగిన స్పందించక పోవడంతో ఈనెల 27న పద్మ తల్లి మల్లిక ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితుడుని ఆదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో హత్య చేసినట్టు అంగీకరించాడు. ముద్దాయితో ఈస్ట్ పోలీసులు మృతదేహం దాచి ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి గుర్తించారు. సాయంత్రం ముద్దాయిని మీడియా సమావేశంలో ప్రవేశపెట్టనున్నామని ఈస్ట్ జోన్ సిఐ శివ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News