Wednesday, January 22, 2025

ఏడేళ్లుగా భార్యను ఇంటికి రానివ్వని భర్త..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ మహిళ ఆడపిల్లకు జన్మనివ్వడమే ఆమె చేసిన పాపంగా మారింది. ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఓ సాడిస్ట్ భర్త తన భార్యను ఏడేళ్లుగా ఇంటికి రానివ్వడం లేదు. ఈ ఘటన ఎక్కడో పల్లెటూరులో కాదు మన బాగ్యనగరంలోనే చోటుచేసుకుంది. తన కూతురితో కలిసి బాధితురాలు మాధవి గత మూడు రోజులుగా అంబర్ పెట్ లోని ఆర్ కె నగర్ లో భర్త కిరణ్ కుమార్ ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేస్తుంది.

ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే తనను భర్త, అత్త, మామలు ఇంటి నుండి గెంటేసారని, తనకు న్యాయం చేయాలని ఏడేళ్లుగా పోరాటం చేస్తున్నట్లు బాధితురాలు పేర్కొంది. మూడు రోజులుగా ఇంటి ముందు నిరసనకు చేస్తున్నా భర్త, అత్త, మామలు పట్టించుకోలేదని.. తనను, తన కూతురిని ఇంట్లోకి అనుమతించే వరకు ఇక్కడే ఉంటానని బాధితురాలు బైఠాయించి నిరసన తెలుపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News