Monday, December 23, 2024

ఆమెను సింధుదుర్గ్ అడవులలో చెట్టుకు కట్టేసి వెళ్లింది ఎవరు?

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర అడవుల్లో చెట్టుకు బందీ అయి 45 రోజులు గడపాల్సి వచ్చిన అమెరికా మహిళ గురించి మరో విషయం తెలిసింది. లలిత కాయి అనే ఈ మహిళ ఈ ఏడాది జూన్‌లో ఓ సారి ముంబైకి వచ్చి వెళ్లారని బుధవారం పోలీసులు తెలిపారు. అయితే ఆమె ఎందుకు ఇక్కడికి వచ్చారనేది వెల్లడికాలేదు. అమెరికాకు చెందిన ఈ 50 సంవత్సరాల మహిళ తమిళనాడులో ఉంటోంది. ఆమెను సింధుదుర్గ్ అడవులలో చెట్టుకు కట్టేసి వెళ్లింది ఎవరు? అనేది పూర్తి స్థాయిలో వెల్లడికాలేదు. అయితే ఆమె భర్తనే ఆమెతో తగవు పడి ఇక్కడి అడవులలో బంధించి వెళ్లాడని ప్రాధమికంగా తెలిసింది. ఈ బాధితురాలి గురించి మరికొంత సమాచారం దొరికిందని తెలిపిన స్థానిక పోలీసు వర్గాలు ఆమె అమెరికాలో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనేది కూడా గుర్తించారు.

తమకు అత్యంత కీలకమైన ఆధారాలు దొరికాయని, పూర్తి స్థాయిలో ఈ ఉదంతం వివరాలు వెలుగులోకి తెస్తామని పోలీసులు తెలిపారు. సింధుదుర్గ్ జిల్లా ఎస్‌పి సౌరభ్ కుమార్ అగర్వాల్ కేసు గురించి మరికొంత సమాచారం ఇచ్చారు. బాధితురాలి రికార్డు నమోదు చేసుకున్నామని, దీని మేరకు దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకొంటోందని తెలిపారు. భర్తతో విడిపోయిన తరువాత ఆమె కొంతకాలం గోవాలో ఉన్నట్లు, జూన్‌లో ముంబైకి వచ్చినట్లు చెప్పారు. ముంబైలో ఆమె ఎంతకాలం ఉంది? ఎవరెవరిని కలిశారు? అనేది తెలియాల్సి ఉంది. ఈ నెల 27వ తేదీన సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలోని సోనూర్లి గ్రామం వద్ద ఆమె బందీ అయిన స్థితిలో స్థానిక గొర్రెల కాపరి సాయంతో కనుగొన్నారు. ప్రస్తుతం ఈ మహిళ గోవాలో చికిత్స పొందుతున్నారు.

పది సంవత్సరాల క్రితం యోగా కోసం తమిళనాడుకు
అమెరికాకు చెందిన ఈ మహిళ పది సంవత్సరాల క్రితం తమిళనాడుకు వచ్చారు. యోగా, ధ్యానం పై ఆసక్తితో , నేర్చుకోవాలని వచ్చానని, తమిళనాడులోనే భారతీయ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటున్నానని కూడా ఆమె తన వాంగ్మూలంలో తెలిపారు. అక్కడనే ఆధార్‌కార్డు సంపాదించుకున్నానని పోలీసులకు రాతపూర్వకంగా తెలిపారు. ఈ విషయాలన్నింటిని నిర్థారించుకుంటున్నామని, ఈ క్రమంలో దర్యాప్తు సాగుతోందని ఎస్‌పి విలేకరులకు వివరించారు. ఆమె స్కి.జోఫెర్నియాతో బాధపడుతోంది. ఆమె భర్త , బంధువుల జాడ తెలుసుకునేందుకు ముంబై పోలీసు బృందాలు తమిళనాడుకు వెళ్లాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News