కరోనా దేశంలో రేపుతున్న కల్లోలానికి ఈ హృదయవిదారక దృశ్యం తార్కాణం. ఆస్పత్రుల్లో పడకల సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజెప్పడానికి ప్రత్యక్ష సాక్షం. ఆగ్రా వికాస్ సెక్టార్7కు చెందిన రవి సింఘాల్ కోవిడ్ బారిన పడ్డాడు. దాంతో అతడి భార్య రేణు సింఘాల్, రవి సింఘాల్‌ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి సిబ్బంది నిరాకరించారు. ఈలోపు రవి సింఘాల్‌కు ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తింది. దాంతో రేణు సింఘాల్ అతడిని సరోజిని నాయుడు మెడికల్ కాలేజీకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఆటోలో ఎక్కి ఆస్పత్రి వెళ్తుండగా అతడి పరిస్థితి చేయి దాటిపోసాగాంది. ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడసాగాడు. దాంతో ప్రమాదం అని తెలిసి కూడా రేణు సింఘాల్ అతడికి నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేసిది. కానీ అవేవి ఫలించలేదు. ఆస్పత్రికి చేరుకునేలోగానే అతడు ఆటోలోనే భార్య ఒడిలో కన్ను మూశాడు. రేణు సింఘాల్ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆమె భర్త బతికి ఉంటే బాగుండు అని నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.