Tuesday, December 24, 2024

ఇంటి పని చేసినందుకు భార్యకు రూ. 1.76 కోట్లు ఇవ్వాల్సిందే: కోర్టు

- Advertisement -
- Advertisement -

మాడ్రిడ్: పెళ్లి జరిగినప్పటి నుంచి విడాకులు తీసుకునే వరకు భార్యను ఉద్యోగం చేయనివ్వకపోవడంతో సతీమణికి భర్త 1.76 కోట్లు భరణం ఇవ్వాలని స్పెయిన్ కోర్టు తీర్పు ఇచ్చింది. భార్యకు మాజీ భర్త 2,04,624 యూరోల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 1995లో దంపతులకు పెళ్లి జరిగింది. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో 2020లో విడిపోయారు. 25 ఏళ్ల పాటు భార్యను బయటకు ఉద్యోగానికి భర్త పంపలేదు. గత 25 సంవత్సరాల నుంచి ఇంట్లో పనులు భార్య చేసింది. దీంతో రోజు సగటు కూలీ ప్రకారం భర్త 1.76 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. కుటంబం కోసం ఆమె జీవితాన్ని త్యాగం చేసినందుకు భరణం కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News