Sunday, December 22, 2024

భర్త వ్యక్తిగత వివరాలను భార్యకు చెప్పక్కర్లేదు!

- Advertisement -
- Advertisement -

ఎంత భార్య అయినా భర్త తన వ్యక్తిగత వివరాలను ఆమెతో పంచుకోనక్కరలేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.  కలసి కాపురం చేస్తున్నా, విడిపోయినా.. భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని జస్టిస్ సునీల్ దత్ యాదవ్, జస్టిస్ విజయకుమార్ పాటిల్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

హుబ్బళ్ళికి చెందిన ఓ మహిళ తన భర్తనుంచి విడిపోయింది. విడాకులు తీసుకునేటప్పుడు కోర్టు ఆదేశించిన మేరకు  భర్త తనకు భరణం చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఆమె మళ్లీ కోర్టు తలుపులు తట్టింది. తన భర్త ఆధార్ కార్డు వివరాలను తనకు అందజేయాలని ఆమె కోరారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు కూడా. అయితే ఆమె విన్నపాన్ని ఉడాయ్ తిరస్కరించింది. దీనిపై ఆమె హైకోర్టుకు వెళ్లారు. ఆమెకు మాజీ భర్త ఆధార్ వివరాలు అందించాలని హైకోర్టు ఉడాయ్ ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను ఉడాయ్ ద్విసభ్య ధర్మాసనం ఎదుట సవాల్ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో హైకోర్టు న్యాయమూర్తి ఆదేశిస్తేనే ఆధార్ వివరాలను వెల్లడించాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉడాయ్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో భాగస్వామి వ్యక్తిగత వివరాలను భార్యకు చెప్పవలసిన అవసరం లేదంటూ ధర్మాసనం తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News