Sunday, December 22, 2024

పెళ్లి వేడుకలో భార్యతో డ్యాన్స్… సోదరులని చంపిన అన్న

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: పెళ్లి వేడుకలో భార్యతో డ్యాన్స్ చేశారని భర్త తన సోదరులని చంపిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కబిర్ధమ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బంగౌరా గ్రామానికి చెందిన టిన్హా బేగా అనే వ్యక్తి ఓ పెళ్లి వేడుకలో తన భార్యతో ఆయన సోదరులు డ్యాన్స్ చేస్తుండగా గమనించాడు. అప్పటికే టిన్హా మద్యం మత్తులో ఉన్నాడు. పదునైన ఆయుధంలో వారిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: కాషాయ ముప్పు తొలగలేదన్న కర్ణాటక

అడ్డుకోబోయిన అన్న, బావపై కూడా దాడి చేశాడు. అనంతరం తన భార్యపై కూడా దాడి చేయడంతో ఆమె గాయపడింది. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు సోదరులు చనిపోయారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్య, బావ, అన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు టిన్హా అదుపులోకి తీసుకున్నామని ఎస్‌పి లాలుమెండ్ సింగ్ తెలిపాడు. నిందితుడు గాయపడడంతో ఆస్పత్రికి తరలించామన్నారు. మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News