Sunday, March 9, 2025

ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని… భార్యను తగలబెట్టిన భర్త

- Advertisement -
- Advertisement -

ముంబయి: ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చినందుకు భార్యను భర్త తగలబెట్టిన సంఘటన మహారాష్ట్రలోని పరబణిలో జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్యంగాఖేడ్ ప్రాంతంలో కందిక్ ఉత్తమ్ కాలే(32), మైనా(27) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనివ్వడంతో భార్యను ఉత్తమ్ వేధించేవాడు. దీంతో భార్యభర్తల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. రెండో రోజుల క్రితం ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో భార్యపై పెట్రోల్ పోసి భర్త తగలబెట్టాడు. దీంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. స్థానికులు గమనించి మంటలను ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మైనా సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News