Monday, December 23, 2024

భార్యపై నాటు తుపాకీతో కాల్పులు

- Advertisement -
- Advertisement -

జూలూరుపాడు: జూలూరుపాడు మం డలం పుల్లూడు తండా గ్రామంలో ఇటీవల భార్యపై నా టు తుపాకీతో కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేసి రి మాండ్‌కు తరలించినట్లు కొత్తగూడెం డి.ఎస్.పి అబ్దుల్ రెహ్మాన్ తెలిపారు. జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి వివరాలు వెల్లడించారు. జూలూరుపాడు మండలం పుల్లూడు తండాకు చెందిన శంకర్ నాటు తు పాకులతో జంతువులను వేటాడి వాటి మాసాన్ని విక్రయించడమే జీవనాధారంగా ఎంచుకున్నాడు. శంకర్ నాటు తుపాకీని చండ్రుగొండ మండలం పోకులగూడెం గ్రామానికి చెందిన భూక్యహరి వద్ద కొనుగోలు చేసి అ డవి జంతువులను వేటాడేవాడు.

ఈ నేపథ్యంలో 2018 వ సంవత్సరంలో శంకర్ తో పాటు నాటు తుపాకుల వి క్రయించిన భూక్య హరిలను పోలీసులు అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించారు. జైల్ నుండి రిలీజ్ అయిన అనంతరం కూడా శంకర్ తీరు మార్చుకోకుండా మరో నాటు తుపాకీని హరి వద్దనే కొనుగోలు చేసి అడవి జంతువులను వేటాడేవాడు.ఈ క్రమంలో శంకర్ అనారోగ్యానికి గురి కావడంతో భార్య అతనిని శారీరకంగా కలవకుండా ఉంచడంతోపాటుగా అదే గ్రామంలో ఉన్న తన తల్లి గారి ఇంటికి వెళ్లిపోయి నివాసం ఉంటుంది.దీంతో భార్యపై అనుమానం పెంచుకున్న శంకర్ భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీన సు మారు 7:30 గంటలకు సమయంలో నాటు తుపాకీతో భార్యపై కాల్పులు జరిపి పరారైనట్లు డి.ఎస్.పి పేర్కొన్నారు. శంకర్‌ని అరుపులు తీసుకొని అతని వద్ద ఓ నా టు తుపాకీతో పాటుగా అందులో వినియోగించే మం దు గుడ్డు సామాగ్రిని సైతం స్వాధీనం చేసుకున్నట్లు డి. ఎస్.పి వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ వసంత్ కు మార్, ఎస్సై గణేష్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News