Monday, January 20, 2025

ప్రేమజంట పారిపోయి పెళ్లి చేసుకుంది… భార్యను పొడిచి

- Advertisement -
- Advertisement -

 

జైపూర్: ప్రేమించాడు… పెళ్లి చేసుకున్నాడు…. తన సొంతింటికి వెళ్ధామని భార్యను భర్త బలవంతం చేశాడు. తాను రానని చెప్పడంతో వెంటనే భార్యను భర్త కత్తితో పొడిచి పారిపోయిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం ధోలపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువతి- యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలకు దూరంగా ఇద్దరు కలిసి బారీ పట్టణంలో నివసిస్తున్నారు.

భార్యతో కలిసి ఇంటికి రావాలని తన కుమారుడికి తల్లిదండ్రులు ఫోన్ చేశారు. తన  ఇంటికి వెళ్ధామని భార్యను భర్త కోరాడు. తాను రానని ఇక్కడే ఉంటానని చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఇద్దరు కలిసి రైలులో వెళ్తుండగా భార్య రాను అని నిరాకరించింది. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ఆమెను కత్తితో పొడిచి భర్త పారిపోయాడు. వెంటనే ఆమె తన తల్లిదండ్రులు ఫోన్ నంబర్లు రాసి అపస్మాకర స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రయాణికులు, రైలు సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News