Sunday, December 22, 2024

సోషల్ మీడియాలో పోస్టు.. భార్యను కత్తితో పొడిచి

- Advertisement -
- Advertisement -

Husband stabbing wife with knife in Chennai

చెన్నై న్యూస్ : సోషల్ మీడియాలో భార్య మరో వ్యక్తితో ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేయడంతో ఆమెను భర్త కత్తి పొడిచిన సంఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోలోమన్ (20) అనే వ్యక్తి సంవత్సరం క్రితం ఈశ్వరీ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈశ్వరీ మరో వ్యక్తితో కలిసి పాటలు పాడిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలను షేర్ చేయవద్దని భార్యకు భర్త హెచ్చరించాడు. కానీ ఆమె మాత్రం భర్త మాట పెడచెవిన పెట్టడంతో పాటు వీడియోలను షేర్ చేస్తుండడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఫుల్‌గా తాగొచ్చిన భర్త సోషల్ మీడియాలో వీడియోల షేర్ విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భర్త కత్తి తీసుకొని భార్య కడుపులో పొడిచాడు. వెంటనే ఘటనా స్థలం నుంచి భర్త పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఈశ్వరీని చికిత్స నిమిత్తం కిలపౌక్ మెడికల్ కాలేజీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి సోలోమన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News