Tuesday, March 4, 2025

పెళ్లైన ఎనిమిది రోజులకే గర్భవతిని గొంతునులిమి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

లక్నో: వివాహం జరిగిన ఎనిమిది రోజుల గర్భవతి అయిన భార్యను భర్త తన తల్లితో కలిసి హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బుదౌన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 19 ఏళ్ల యువతి, 17 ఏళ్ల యువకుడు ఎనిమిది రోజుల క్రితం పెళ్లి చేసుకుంది.సదరు యువతి గర్భం దాల్చింది. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెచుకున్నాడు. తన తల్లితో కలిసి భార్య గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఇంట్లో నుంచి యువకుడు తన తల్లితో కలిసి పారిపోయాడు.  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి రెండు నెలల గర్భవతి అని పోలీసులు వెల్లడించారు. భార్యను హత్య చేసేటప్పుడు ఇంట్లో నుంచి పెద్దగా మ్యూజిక్ సౌండ్ వినిపించిందని ఇరుగుపొరుగు వారు తెలిపారు. ఇద్దరు మధ్య గతంలో శారీరక సంబంధం ఉన్నట్టు బంధువులు వెల్లడించారు. అత్త, భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News