లక్నో: ఒక రాత్రి రెండో సారి శృంగారానికి ఒప్పుకోలేదని భార్యను భర్త గొంతునులిమి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమ్రోహ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమ్రోహ ప్రాంతంలో మహ్మాద్ అన్వర్ అనే వ్యక్తి బేకరీ నడిపిస్తూ ముగ్గురు పిల్లలు, భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ఒక రాత్రి రెండో సారి శృంగారం చేస్తానని భార్యను భర్త అడిగాడు. ఆమె తిరస్కరించడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భార్య గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 50 కిలో మీటర్ల దూరంలో పడేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్య కనిపించడంలేదని ఫిర్యాదు చేశాడు. భర్తపై పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
రెండో సారి శృంగారానికి ఒప్పుకోలేదని భార్యను చంపి…
- Advertisement -
- Advertisement -
- Advertisement -