Wednesday, April 9, 2025

విషాదం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. అనాథలుగా మారిన పిల్లలు

- Advertisement -
- Advertisement -

మంచిర్యాలః జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని లక్సెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పక్కింటి వాళ్లతో గొడవ పడిన భార్య శరణ్య.. మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో భార్య శరణ్యను కరీనంగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

అయితే, చికిత్స పొందుతూ భార్య మరణించింది. భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తుండగా..తన భార్య మృతిని తట్టుకోలేక భర్త మార్గమధ్యంలో లారీ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News