Wednesday, January 22, 2025

భార్య మోసం చేసిందని భర్త సూసైడ్…

- Advertisement -
- Advertisement -

సరూర్‌నగర్ ఠాణాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

మన తెలంగాణ/ ఎల్బీనగర్ : భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన భర్త సెల్ఫీ తీసుకొని సూసైడ్ (బలవన్మరణానికి) పాల్పడిన ఘటన సరూర్‌నగర్ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… దిల్‌సుక్‌నగర్ కోదండరామ్‌నగర్‌కు చెందిన గూడురు శేఖర్‌కు (36), మల్కాజిగిరికి చెందిన యువతితో 14 ఫిబ్రవరి 2014లో వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కూతురు (7), ఏడాదిన్నర వయస్సు కుమారుడు ఉన్నాడు. శేఖర్ భార్య హైదరాబాద్ కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పని చేస్తుండగా 2022 జనవరిలో డిప్యూ టీ జనరల్ మేనేజర్‌గా ఆదిలాబాద్‌కు బదిలీపై వెళ్లింది. కాగా 2019 సంవత్సరం నుంచి ఓ వ్యక్తితో చనువుగా ఉండటంతో భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నిలదీయగా తప్పు ఒప్పుకొని పెద్దల సమక్షంలో భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయనని క్షమాపణ కోరింది.

అయితే ఆదిలాబాద్ బదిలీ అయిన వెంటనే మళ్లీ ఆ వ్యక్తితో కలిసి సహజీవనం కొనసాగిస్తుంది. దీంతో భర్త శేఖర్ తీవ్ర మనోవేదనకు లోనై ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శేఖర్ తల్లిదండ్రులు వెంటనే స్థాని కంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శేఖర్ చికిత్స పొం దుతూ నవంబర్ 9వ తేదీ మృతి చెందాడు. సూసైడు ముందు కన్న పిల్లలు అన్యాయం అయి పోతారని శేఖర్ తన ఆవేదనను భార్య గురించి సెల్ఫీలో ప్రస్తావిస్తూ కన్నీటి పర్వాంతమయ్యాడు. తన కుమారుడు శేఖర్ మృతికి కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తండ్రి గూడురు శంభయ్య సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూమారుడులాగా మరెవ్వరికి ఇలాంటి దుస్థితి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News