Monday, December 23, 2024

గొలుసు మింగిన భర్త… నో ఆపరేషన్… కడుపులో నుంచి తీసిన వైద్యులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: మతిస్థిమితం లేని వ్యక్తి తన భార్య గొలుసు మింగేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజేంద్రనగర్‌లో రామాంజనేయులు అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తుంటాడు. రామాంజనేయులకు గత కొన్ని రోజుల మతిస్థిమితం లేకపోవడంతో వింతగా ప్రవర్తిస్తుంటాడు. నెల రోజుల క్రితం భార్య నల్లపూసల గొలుసు మింగేశాడు.

Also Read: రూ. 100కే చొక్కా..బేరమాడిన జపాన్ దౌత్యవేత్త

ఇంట్లో ఎవరికీ చెప్పకపోవడంతో కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. స్కాన్ చేయగా కడుపులో గొలుసు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ చేసి తీయాలని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ లేకుండా కడుపులో నుంచి గొలుసును నోటి ద్వారా బయటకు తీశారు. నయా పైసా ఖర్చు లేకుండా వైద్యం చేసిన డాక్టర్లను సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు కంటే ప్రభుత్వ ఆస్పత్రులు బెటర్ సర్వీస్ చేస్తున్నాయని కామెంట్లు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News