Wednesday, January 22, 2025

అత్తింట్లో ఉన్న భార్యను చూసేందుకు…. ఆర్‌టిసి బస్సును అపహరించిన భర్త

- Advertisement -
- Advertisement -

అమరావతి: భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆమె చూసేందుకు భర్త ఆర్‌టిసి అద్దె బస్సును అపహరించి అత్తింటికి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామంలో దరగయ్య తన భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అతడు లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి భార్య తన పుట్టింటికి పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రికి వెళ్లింది. దీంతో ఆమెను చూసేందుకు ముచ్చుమర్రికి వెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున ఆత్మకూరు బస్టాండుకు చేరుకున్నాడు. అక్కడ ముచ్చుమర్రికి వెళ్లే బస్సులు లేకపోవడంతో ఆత్మకూరు శివారులో నిలిపి ఉన్న ఆర్‌టిసి అద్దె బస్సును ఎక్కాడు.

బస్సులో వెతకగా తాళం చేవి కనిపించడంతో బస్సును స్టార్ట్ చేసి ముచ్చుమర్రికి బయలుదేరారు. వెనక వచ్చే బస్సులకు సైడ్ ఇవ్వకపోవడంతో ఆత్మకూరు డిపో డ్రైవర్లకు అనుమానం వచ్చి బస్సు యజమానికి సమాచారం ఇచ్చారు. పడిడ్యాల వైపు బస్సు వెళ్తోందని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ముచ్చుమర్రి వద్ద బస్సును పోలీసులు ఆపి దరగయ్యను అదుపులోకి తీసుకున్నారు. మద్యంతో మత్తులో ఉండడంతో కుటుంబ సభ్యులను పిలిచి విచారించారు. మద్యానికి బానిస కావడంతో పాటు మతిస్థిమితం లేదని గతంలో పలుమార్లు లారీలను అపహరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. యజమాని ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు దరగయ్య హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News