- Advertisement -
రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సోమవారం గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తాను కట్టుకున్న భార్య గొంతు కోశాడు. నిందితుడిని ఐలయ్యగా గుర్తించారు. ఈ దాడిలో బాధితురాలిని స్వాతి తీవ్రంగా గాయపడింది. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
- Advertisement -