Monday, January 27, 2025

హుస్సేన్ సాగర్‌లో అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ముగ్గురికి గాయాలు, బాణసంచా పేలి రెండు పడవల్లో చెలరేగిన మంటలు, రెండు బోట్లు దగ్ధం, అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ నలుగురు
మన తెలంగాణ / హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భరత మాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పీపుల్స్ ప్లాజా వేదిక వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆదివారం రాత్రి బాణసంచా పేల్చేందుకు తెలంగాణ టూరిజం శాఖకు చెందిన రెండు బోట్లలో బాణ సంచా సామగ్రిని హుస్సేన్ సాగర్ మధ్యలోకి తీసుకెళ్లారు. టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు తిరిగి అదే బోట్లపై పడటంతో వాటిలో నిల్వ చేసిన బాణసంచా పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు బోట్లలో ఏడుగురు ఉండగా వారిలో ముగ్గురికి గాయాలయ్యాయి. నలుగురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News