Saturday, December 21, 2024

పేదల గుడిసెలను పెట్రోలు పోసి దగ్ధం

- Advertisement -
- Advertisement -

చెన్నూర్ ః గత మూడు నెలలుగా తాత్కలిక గుడిసెలు వేసుకొని బావురావ్ పేట శివారులో సర్వే నెంబర్ 8 సుమారు మూడు వందల గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. దీనికి సిపిఐ పార్టీ మద్దతు తెలుపడంతో కొందరు పేదలు తాక్కలి గుడిసెలు వేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం కొందకు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి సుమారు 100 గుడెశెలను దగ్ధం చేయడంతో అందులో ఉన్న నిత్యావసర సరుకులు, డబ్బులు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇది సుమారు 300 ఎకరాలు అసైన్ ల్యాండు దీనిలో గుడిసెలు వేసుకోవడంతో కోపోద్రికులైన అసైన్‌ండ్ భూయజమానులు గుడిసెలను దగ్ధం చేసారని, నిరుపేదలకు ఉండాల్సిన భూమి వీరి పేరున ఎల మారిందని వారు ఆవేద వ్యక్తం చేసారు. గుడిసెలను దగ్ధం చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి పేదలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News