Thursday, January 23, 2025

మే 6 లోగా పాస్‌పోర్టులు సమర్పించండి

- Advertisement -
- Advertisement -

హజ్ యాత్రీకులకు హజ్‌కమిటి పిలుపు

Huz tour in Telangana
మన తెలంగాణ / హైదరాబాద్ : హజ్ యాత్ర 2022కు డ్రా ద్వారా ఎంపికైన యాత్రీకులు మే 6వ తేదీలోగా తమ వర్జినల్ పాస్‌పోర్టులను మే 6వ తేదీలోగా సమర్పించాలని తెలంగాణ హజ్ కమిటి కోరింది. ఈ మేకు హజ్‌కమిటి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వర్జినల్ పాస్‌పోర్ట్‌తో పాటు , జిరాక్స్ కాపితో పాటు డౌన్‌లోడ్ చేసి పూర్తి చేసిన అప్లికేషన్ ఫాం, డిక్లరేషన్ ఫాం, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, రూ. 81,000 చెల్లించిన రశీదు, రెండు ఫొటోలు, కోవిడ్ సర్టిఫికెట్, బ్యాంకు వివరాలు అన్నింటిని శుక్రవారంలోగా సమర్పించాలని సూచించింది. జూన్ మధ్య కాలం నాటికి ప్రారంభం అయ్యే హజ్ యాత్రకు సన్నద్దం కావాలని సూచించారు. త్వరలోనే హజ్ కమిటి ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోనూ, జిల్లాల్లోనూ హజ్ శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News