Sunday, November 3, 2024

హుజూరాబాద్ పోరుకు నగర గులాబీ నేతలు

- Advertisement -
- Advertisement -
Huzurabad by election 2021
ప్రచారం చేసేందుకు సిద్దమైన పలు డివిజన్ల నాయకులు
మంత్రి తలసాని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కదులుతున్న కార్యకర్తలు
ప్రభుత్వం చేపట్టిన పథకాలు వివరించేందుకు ఇంటింటా ప్రచారం
అట్టహాసంగా నామినేషన్ వేసేందుకు పార్టీ సీనియర్ల వ్యుహలు

హైదరాబాద్: గ్రేటర్ నగర టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు హుజూరాబాద్ ఎన్నికల నగరా మోగడంతో ప్రచార రథాలపై పరుగులు పెట్టేందుకు సిద్దమైయ్యారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించేందుకు రాజకీయ వ్యుహాలు రచిస్తున్నారు. గతంలో పలు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లి నగర గులాబీ నేతలు హుజూరాబాద్‌లో తమ సత్తా చాటేందుకు నడుం బిగిస్తున్నారు. ఇటీవలే పలు డివిజన్లకు చెందిన కమిటీలు ఏర్పాట్లు కావడంతో నూతనంగా ఎన్నికైన వివిధ విభాగాలకు చెందిన అధ్యక్షులంతా ప్రచార పోరుకు కాలు దువ్వుతున్నారు. సిఎం కెసిఆర్ రెండోసారి అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి విపక్ష పార్టీల అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దళితబంధు, గొర్రెల పంపిణీ, సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా, రైతు బంధు లబ్దిదారుల ఇంటింటికి తిరిగి ప్రచారం చేయనున్నట్లు నగర నాయకులు పేర్కొంటున్నారు.

గులాబీ పార్టీ తరుపున తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్ధినేత, బలహీనవర్గాలకు చెందిన యువకుడుకి సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ బిసి వర్గాల అభ్యన్నతి కోసం పాటు పడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటివరకు ఏపార్టీ అధినేతలు ఇలాంటి తరహాలో అభ్యర్దులను ఎంపిక చేయలేదని, భవిష్యత్తులో యువతకు టిఆర్‌ఎస్‌లో సముచితం లభిస్తుందని ఆశాభావ వ్యక్తం చేస్తున్నారు. నగర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారానికి కార్యకర్తలు కదులుతున్నట్లు పార్టీ సీనియర్లు వెల్లడిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైతుండటంతో ముందుగానే ప్రచారానికి శ్రేణులు సిద్దం చేసి నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓయూ విద్యార్థినేతలు రాజారాంయాదవ్, తొట్ల స్వామి, బొల్లు నాగరాజు ప్రచారం నిర్వహిస్తున్నారు.

టిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమకారులకు ఉన్నతమైన పదవులు కట్టబెడుతూ యువతకు ప్రాధాన్యత ఇస్తుందని, కమలం, కాంగ్రెస్ నాయకులు చేసే ప్రచారానికి ప్రజలు నమ్మవద్దని వారంతా ఉనికి కోసం పాకులాడుతున్నారని నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో రైతుబంధు, దళిత బందు దేశంలో పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సభా వేదికలపై ప్రజలకు వివరిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టిఆర్‌ఎస్ విజయం సాధిస్తే భవిష్యత్తులో కొత్త పథకాలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పెద్దలు రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్దిలో పరుగులు పెట్టాలంటే సిఎం కెసిఆర్‌తో సాధ్యమని నేతలు ప్రచారంలో ఓటర్లకు చెబుతున్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు దంచే నాయకుల మాటలకు మోసపోవద్దని గులాబీనేతలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News