Sunday, November 3, 2024

హుజూరా’వార్’ నేడే

- Advertisement -
- Advertisement -

Huzurabad bypoll today

అత్యంత ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటు పోరుకు లేచిన తెర
ఉ॥ 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్
306 పోలింగ్ కేంద్రాలు, మొత్తం ఓటర్లు : 2,37,036 మంది, మహిళలు :1,19,102 మంది, పురుషులు : 1,17,938 మంది
కొవిడ్ నిబంధనల అమలు, వికలాంగుల కోసం వీల్‌చైర్స్ ఏర్పాటు చేశాం : సిఇఒ

మనతెలంగాణ/హైదరాబాద్/కరీనంగర్ : హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం(అక్టోబర్ 30) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ సమయంలో నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 107 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 47 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. వయోవృద్ధులు, కొవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,37,036 మంది ఓటర్లు ఉన్నారు.

ఇందు లో పురుష ఓటర్లు 1,17,933, మహిళ ఓ టర్లు 1,19,102 మంది ఉన్నారు. ఎన్‌ఆర్ ఐ ఓటర్లు 14 మంది ఉండగా, సర్వీస్ ఓట ర్లు 149 ఓట్లు ఉన్నాయి. హుజురాబాద్ ఉ ప ఎన్నిక బరిలో మొత్తం 30 మంది అభ్యర్థు లు ఉండగా, రెండు ఇవిఎంలు ఉండనున్నా యి. ఈ నెల 30వ తేదీన హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగనుండగా, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. హు జురాబాద్ నియోజకవర్గం పరిధిలో గురువారం రాత్రి 7 గంటల నుంచి 30వ తేదీ రాత్రి 7 గంటల వరకు, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు రోజున మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. కేంద్రాలలో మాస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు. కొవిడ్ పాజిటివ్ ఉన్న వారి కి, అనుమానితుల కోసం పిపిఇ కిట్లను అం దుబాటులో ఉంచారు.

కట్టుదిట్టమైన భద్రత

ఉప ఎన్నిక సందర్భంగా కట్టుదిట్టమైన భద్ర తా ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా 20 కంపెనీల కేంద్ర బ లగాలు మోహరించారు. అలాగే 74 మంది ప్రత్యేక పోలీసు బృందాలు, 700 మంది కరీంనగర్ జిల్లా పోలీసులు, 1,471 ఇతర జిల్లాల పోలీసులు ఎన్నికల బందోబస్తు ని ర్వర్తిస్తున్నారు.

పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి : సిఇఒ

హుజూరాబాద్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సిఇఒ శశాంక్ గోయల్ తెలిపారు. శనివారం(అక్టోబర్ 30) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పో లింగ్ జరుగుతుందని వెల్లడించారు. పోలిం గ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు సిఇఒ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ సం దర్భంగా 32 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామని తెలిపారు. 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈసారి ఓటింగ్ శా తంపెరగాలని, ఓటర్లంతా తమ ఓటు హ క్కును వినియోగించుకోవాలని కోరారు. ఇ విఎంల పరిశీలనకు ఆరుగురు ఇంజినీర్లు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు.
ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు సిఇఒ స్పష్టం చేశారు. పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, కొన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News