- Advertisement -
చెన్నై: బ్యాటరీ, బయో ఇంధనంతో ఎగిరే కారును చైన్నైకి చెందిన ‘వినత’ ఏరో మొబిలిటీ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ కారు గంటకు 120కిమీ. వేగంతో 3000 అడుగుల ఎత్తులో 60 నిమిషాలపాటు ప్రయాణించగలదు. గరిష్ఠంగా 1300 కిలోల బరువు మోసుకెళ్లగలదు. ఇది నిట్టనిలువుగా(వర్టికల్‌గా) లేవడం, దిగడం చేస్తుంది. ఈ ఫ్లయింగ్ కారుతో భవిష్యత్తులో రవాణా, కార్గో అవసరాలు, ముఖ్యంగా వైద్య అవసరాలు తీరుతాయని భావిస్తున్నారు. 2023 నాటికి ఓ రూపానికి ఈ ఫ్లయింగ్ కారు రాగలదు. ఇలాంటి ఫ్లయింగ్ కార్లు 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్విట్ ద్వారా ఈ ఆవిష్కరణను అభినందించారు.
- Advertisement -