Monday, December 23, 2024

లంగర్ హౌస్ చెరువు, హుడా పార్కు ఆకస్మిక తనిఖీ

- Advertisement -
- Advertisement -
Hyd Mayor inspection of Langar Houz Lake And Huda Park
సుందరీకరణ పనులు తక్షణమే చేపట్టాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: లంగర్ హౌస్ చెరువుతో పాటు హుడా పార్కు సుందరీకరణ పనులు తక్షణమే చేపట్టాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం లంగర్ హౌస్ చెరువు, హుడా పార్కును మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ విజయ లక్ష్మి మాట్లాడుతూ. చెరువులో గుర్రపు డెక్కను యుద్ధప్రాతిపదికన తొలగించడంతో పాటు సుందరీకరణ పనులు వెంటనే చేపట్టాలన్నారు. ఇందుకు అన్ని విభాగాలను అధికారులు సమన్వయంతో సాధ్యమైనంత వేగంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. గుర్రపు డెక్క తొలగింపు ప్రక్రియతో పాటు చెరువులో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జోనల్ కమిషనర్, యు.బి.డి, ఎంటమాలజి శాఖలు సమన్వయంతో యాంటీ లార్వా ఆపరేషన్‌ను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజి అధికారి రాంబాబు, జోనల్ కమిషనర్ రవికిరణ్, యుసిడి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News