ఫొటొః కారు పేరుతో ఉంది…
మహారాష్ట్రలో కొనుగోలు చేసి నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 120 మి. గ్రాముల ఎండిఎంఏ, కారును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 21.06లక్షలు ఉంటుంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి చెందిన హర్జత్ సింగ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. డ్రగ్స్‌కు బానిసగామారిని నిందితుడు వచ్చే జీతం మొత్తం డ్రగ్స్ కొనుగోలుకు వెచ్చిస్తున్నాడు. దీంతో డబ్బులు సరిపోవడంలేదు, ఈ క్రమంలోనే తాను డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ వేశాడు. తక్కువ ధరకు డ్రగ్స్‌ను మహారాష్ట్రలోని పూణేలో కొనుగోలు చేసి తనతో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నాడు. ఈ తతంగం గత కొంత కాలం నుంచి కొనసాగుతోంది. డ్రగ్స్ కోసం మహారాష్ట్ర పూణేకు కారులో వెళ్లిన హర్జిత్ అక్కడ 120 మీల్లీ గ్రాముల ఎండిఎంఎ క్రిస్టల్స్ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు బయలు దేరాడు. ఈ విషయం ఎక్సైజ్ సిబ్బందికి తెలియడంతో సంగారెడ్డి డిటిఎఫ్ సిబ్బంది తనిఖీలు చేసి వాహనాన్ని పట్టుకున్నారు. కారులో తనిఖీ చేయగా డ్రగ్స్ లభించాయి. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిఐ సిహెచ్ చంద్రశేఖర్, ఎస్సైలు యాదయ్య, హన్మంతు, శ్రీనివాస్‌రెడ్డి, పిసి ప్రభాకర్ రెడ్డి పట్టుకున్నారు.