Friday, April 4, 2025

అబిడ్స్ లో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం జరగడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు పక్కనున్న హోటల్‌కు వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు మూడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తున్నాయి. మంటలు అంటుకుని ఇప్పటికే పదికి పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. దేవాదాయశాఖ కార్యాలాయానికి సమీపంలోనే ఈ అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News