Monday, January 13, 2025

ప్రేమ… అమీర్‌పేట్‌లో యువతి ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించడంలేదని ఓ యువతి హాస్టల్ దిలో ఉరేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో అమీర్‌పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువతి(18) హైదరాబాద్‌లో ఓ కంపెనీలో టెలీకాలర్‌గా జాబ్ చేస్తుంది. అమీర్‌పేటలోని వసతి గృహంలో ఉంటుంది. హాస్టల్ గదిలో యువతి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకోవడంతో హాస్టల్ నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

Also Read: పెళ్లి మండపంలో వధువు, వరుడిపై యాసిడ్ దాడి…. పది మందికి గాయాలు

యువతి స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఓ గ్రామంగా గుర్తించారు. తన గ్రామంలో యువకుడిని ప్రేమించడంతో పెళ్లి చేసుకుంటానని పెద్దలకు చెప్పడంతో యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. యువతిని మందలించడంతో సొంత గ్రామం నుంచి హైదరాబాద్‌కు వచ్చి హాస్టల్ మాట్లాడుకుంది. ఇంటికెళ్లి తన దుస్తులు, సామాగ్రి తీసుకొని హైదరాబాద్‌కు వచ్చింది. ఇంటికెళ్లినప్పుడు ఎవరు మాట్లాడకపోవడంతో మనస్తాపం చెంది హాస్టల్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News