Monday, December 23, 2024

మీటింగ్‌ల పేరుతో ఉద్యోగినిపై సిఇఒ లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ కంపెనీ సిఇఒ లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఆ యువతి మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమీర్‌పేటలోని ఓ కంపెనీలో యువతి హెచ్‌ఆర్, లీగల్ మేనేజర్‌గా పని చేస్తుంది. సదరు కంపెనీ సిఇఒ తొండెపుచంద్ర అమెరికా నుంచి ఆమెతో జూమ్ మీటింగ్‌లో పాల్గొనేవాడు. జూమ్ మీటింగ్ పాల్గొన్నప్పుడు ఏకవచనంతో మాట్లాడి ఆమెను పలుమార్లు ఇబ్బందులకు గురి చేశాడు. రెండు నెలల క్రితం సదరు సిఇఒ అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు.

మీటింగ్‌ల పేరుతో పలుమార్లు ఆమెను లైంగికంగా వేధించాడు. జనవరి 2న ఓ నెక్టెస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్ రమ్మని కబురు పంపడంతో పాటు తన కోరిక తీర్చాలని డిమాండ్ చేయడంతో యువతి నిరాకరించింది. తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని ఆమె అతడికి ఈమెయిల్ ద్వారా తెలిపింది. సాలరీతో పాటు ఎక్స్‌పీరియన్స్ లేటర్ ఇవ్వాలని అడిగింది. అతడు నిరాకరించడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News