ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాగా కోకాపేట్
టిఎస్ బిపాస్ ద్వారా 21 రోజుల్లో అనుమతులు
గ్రీన్ ఫీల్ ప్రాజెక్ట్ గా కోకాపేట్ లే ఔట్
ఈ లే ఔట్‌లో నో ఎఫ్‌ఎస్‌ఐ లిమిట్స్
400 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణం కోసం 5.3ఎకరాల స్థలం కేటాయింపు
వాటర్ వర్క్‌బోర్డు పంప్‌హౌస్ నిర్మాణానికి 9.30ఎకరాలు కేటాయింపు
హైదరాబాద్ : అభివృద్ధికి ఐకాన్‌గా హైదరాబాద్ నిలిచిందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఎ) కమిషనర్ అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. దేశంలో అత్యున్నత నగరాలకు ధీటుగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. శుక్రవారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐసిఐసిఐ టవర్స్‌లో జరిగిన ‘కోకాపేట్ ఈ- ఆక్షన్ ఫ్రీ బిడ్ మీటింగ్’ కు హాజరైన పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, డెవలపర్స్‌లను ఉద్ధేశించి హెచ్‌ఎండిఏ కమిషనర్ అర్వింద్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి జోనల్ రిస్ట్రిక్షన్స్ లేని మల్టీ యూజ్ జోన్ ‘కోకాపేట్ హెచ్‌ఎండిఎ లే ఔట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఆయన తెలిపా రు. వంద అడుగుల రోడ్లు అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్ వ్యవస్థలతో అధునాతమైన ఇన్ఫాస్ట్రక్చర్ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా గా కోకాపేట్ ఏరియాకు ముద్ర పడిందని, వచ్చే రెండు దశాబ్దాల కాలంలో కోకాపేట్ పరిసరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పవర్ ఇన్ఫాస్ట్రక్చర్ కోసం 5.3 ఎకరాల స్థలాన్ని తెలంగాణ ట్రాన్స్‌కోకు కేటాయించామని, ఇందులో 400/ 220/132/33 కెవి సామర్ధ్యం గల సబ్ స్టేషన్‌ల నిర్మాణం జరుగుతుందన్నారు.
కొల్లూరు నుంచి ప్రత్యేకంగా వాటర్ పైపులైన్
కోకాపేట్ లే ఔట్ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం కొల్లూరు నుంచి ప్రత్యేకంగా వాటర్ పైపులైన్ ఏర్పాట్లు జరుగుతాయన్నారు. వాటర్‌వర్క్ బోర్డు పంప్‌హౌస్ నిర్మాణానికి 9.30 ఎకరాలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఔటర్ రింగ్‌రోడ్డు(ఓఅర్‌అర్) నుంచి కోకాపేట్ లే ఔట్ లోకి నేరుగా వాహనాలు చేరుకునేలా ప్రత్యేకంగా ట్రంపెట్ నిర్మిస్తున్నట్లు అర్వింద్‌కుమార్ తెలిపారు. భవిష్యత్‌లో కోకాపేట లే ఔట్ లో వచ్చే బహుళ అంతస్తుల నిర్మాణాలు, అందులో పని చేసే ఉద్యోగులు, అక్కడి జనసాంద్రతతకు అనుగుణంగా ట్రంపె ట్ నిర్మాణానికి రూపకల్పన చేసినట్లు అర్వింద్ కుమార్ వివరించారు. కోకాపేట్ లే ఔట్‌లో నిర్మాణాలకు టిఎస్ బిపాస్ ద్వారా 15 నుంచి 21రోజుల్లో అనుమతులు లభిస్తాయని, అక్కడి నిర్మాణాలకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్‌ఎస్‌ఐ) పరిమి తి ఉండదని అర్వింద్ అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు డెవలపర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చే వారి సందేహాలను అర్వింద్‌కుమార్ నివృత్తి చేశా రు. ప్రీపెయిడ్ సమావేశంలో హెచ్‌ఎండిఎ సెక్రటరీ సంతోష్ ఐఏఎస్, చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి, చీఫ్ అకౌంట్స్ ఆఫీస ర్ (సిఎఓ)విజయలక్ష్మి, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, ఓఎస్డీ రాం కిషన్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు.