Monday, January 20, 2025

హైదరాబాద్ బెగ్గింగ్ మాఫియా

- Advertisement -
- Advertisement -

వృద్ధులతో భిక్షాటన.. నిర్వాహకుడి పట్టివేత

మన తెలంగాణ/హై-దరాబాద్ : నగరంలో బెగ్గింగ్ మాఫియాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు . దీనికి సంబంధించిన జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ వద్ద 23 మంది యాచకులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో భిక్షాటన చేయిస్తున్న బెగ్గింగ్ మాఫియా నిర్వాహకుడు అనిల్ పవార్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 23 మంది బిచ్చగాళ్లను రెస్క్యూ హోంకు తరలించినట్లు వెల్లడించారు. నిర్వాహకుడిపై భిక్షాటన నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెగ్గింగ్ నిర్వాహకుడు అనిల్ వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులను తీసుకొచ్చి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, పరిసర ప్రాంతాల్లో వారితో భిక్షాటన చేయిస్తున్నాడు. యాచకులందరి నుంచి రోజుకు రూ. 4500 నుంచి 6000 వరకు తీసుకుంటాడు. దీనికి ప్రతిగా ఒక్కో బిచ్చగాడికి రోజుకు రూ. 200 కూలీగా చెల్లిస్తున్నాడు. ఈ క్రమంలో సిగ్నల్స్ వద్ద భిక్షాటనతో ఇబ్బందులకు గురైనవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News