Wednesday, December 25, 2024

భుజం తగిలినందుకు కత్తితో పొడిచి చంపారు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భుజం తగిలిందని ఓ యువకుడి ప్రాణం తీసిన సంఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బేగంపేటలోని అంబేడ్కర్‌నగర్‌లో రాజు- యాదమ్మ అనే దంపతులకు తరుణ్(18) అనే కుమారుడు ఉన్నాడు. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఓ పాన్ షాకు వెళ్లాడు. ఓ యువకుడి భుజం తగలడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. వెంటనే సదరు యువకుడు వెళ్లి తన రూమ్‌లో ఉన్న ముగ్గురు స్నేహితులను ఇంటికి తీసుకొని వచ్చాడు. తరుణ్ తో ముగ్గురు యువకులు గొడవకు దిగడంతో ఉద్రిక్తంగా మారింది. నలుగురు గదికి వెళ్లి కత్తి తీసుకొని వచ్చి తరుణ్ కడుపులో పలుమార్లు పొడిచారు. తరుణ్ రక్తపుమడుగులో కనిపించడంతో స్థానికులు యాదమ్మకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తరుణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పండు(22), సాయికిరణ్(21), ఎ తరుణ్(21), శివశంకర్(24)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన వీరు ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News