Friday, December 27, 2024

బేగంపేటలో పూరీలు గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

బేగంపేట: హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ స్కూళ్లో పూరీలు తింటుండగా అవి గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓల్డ్‌బోయిగూడకు చెందిన గౌతమ్ జైన్ తనయడు వీరేన్ జైన్(11) బేగంపేటలోని అక్షర వాగ్ధేవి ఇంటర్ నేషనల్ స్కూళ్లో ఆరో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం భోజనం సమయంలో ఉండలు చుట్టిన మూడు పూరీలు తింటున్నాడు. ఉండ చుట్టిన పూరీ గొంతుల్లో ఇరుక్కొని పోవడంతో ఊపిరాడక అపస్మరాక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే సిబ్బంది బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తండ్రి గౌతమ్ జైన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News