Monday, December 23, 2024

రికార్డు సృష్టించిన హైదరాబాద్ బిర్యానీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ బిర్యానీ టేస్టే వేరు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా హైదరాబాద్ బిర్యానీ ఉంటే చాలు అనుకునే అభిమానులు కోకొల్లలు. ఇప్పడు మన హైదరాబాద్ బిర్యానీ మరో రికార్డు సృష్టించింది. పర్యాటక ఆన్ లైన్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ ప్రకటించిన అత్యుత్తమ ఆహార పదార్థాల జాబితాలో హైదరాబాద్ బిర్యానీకి 39వ స్థానం లభించింది.

అనేక దేశాల్లోని నగరాలను, అక్కడ లభించే ఆహార పదార్థాలను సమీక్షించిన తర్వాత టేస్ అట్లాస్ 100 స్థానాల్లో ఉన్న ఆయా నగరాల్లోని ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో ఇటలీ వంటకాలకు మొదటి స్థానం లభించింది. ఇండియాలో దోశ, వడాపావ్, పావ్ భాజీ, పానీపూరీ, బిర్యానీలను ఇష్టంగా తింటున్నట్లు టేస్ట్ అట్లాస్ అంచనా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News