Wednesday, January 22, 2025

ఉద్యోగం ఇప్పిస్తానని బొరబండలో యువతిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆఫీస్‌కు పిలిపించుకొని యువతిపై అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని బొరబండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువతికి ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి కార్యాలయానికి రమ్మని కబురు పంపాడు. కార్యాలయం వచ్చిన తరువాత ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. దీంతో యువతి ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News