Saturday, December 28, 2024

ఎయిర్‌పోర్టు సర్వీసులకు క్యాబ్ డ్రైవర్ల బహిష్కరణ: ప్రయాణికుల తిప్పలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు తమ ట్రిపల్‌ను బహిష్కరించాలని క్యాబ్ డ్రైవర్లు తీసుకున్న తాజా నిర్ణయం విమానాశ్రయం వద్ద ప్రయాణికులను పడరాని పాట్లకు గురిచేస్తోంది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ యూనియన్(టిజిపిడబ్లుయు) చేస్తున్న లోఫేర్ నోఎయిర్ ప్రచార ఉద్యమంలో భాగంగా క్యాబ్ డ్రైవర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్కువ చార్జీల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని డ్రైవర్లు చెబుతున్నారు.

క్యాబ్ అగ్రేగేటర్లయిన ఓలా, ఊబర్ వసూలు చేస్తున్న చార్జీలతో తాము నగరంలో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని వారు వాపోతున్నారు. క్యాబ్ డ్రైవర్ల బహిష్కరణ కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ప్రయాణికులు క్యాబ్‌ల కోసం బారులు తీరి గంటలకొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. తమ బహిష్కరణ నిర్ణయం ద్వారా ఓలా క్యాబ్స్, ఊబర్‌కు తమ సమస్యలను తెలియచేయాలని క్యాబ్ డ్రైవర్లు భావిస్తున్నారు.

ఎయిర్‌పోర్టు, హైదరాబద్ నగరం మధ్య ప్రస్తుతం రూ. 300 నుంచి రూ. 600 వరకు చార్జీలు వసూలు చేస్తున్న్రారని, ఇది ఎంతమాత్రం గిట్టుబాటు కాదని యూనియన్ వివరిస్తోంది. ఓలా, ఊబర్ క్యాబ్‌లను నడిపిస్తున్నపటికీ అవి ప్రయాణికుల రద్దీకి ఏమాత్రం సరిపోవడంస్విమాన ప్రయాణికులు నగరంలోని తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవలసి వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News