Wednesday, January 22, 2025

ఇన్సూరెన్స్ పేరుతో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఇన్సూరెన్స్ రిన్యూవల్ పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఆరు ఎటిఎం కార్డులు, ఆరు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…తమిళనాడు రాష్ట్రం, చెన్నైకి చెందిన బల్లారి పవన్‌కుమార్, ఎపిలోని కర్నూలుకు చెందిన సౌదరి బసవరాజ్ కలిసి నేరాలు చేస్తున్నారు. పవన్‌కుమార్, బసవరాజ్‌తో కలిసి నకిలీ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇద్దరు కలిసి చోళా ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో పాలసీ తీసుకున్న వారి వివరాలు తెలుసుకున్నారు.

వారికి ఫోన్ చేసి పాలసీ రెన్యూవల్ పేరుతో పాలసీదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇలా పలువురు బాధితుల నుంచి రూ.1,88,599 వసూలు చేశారు. పాలసీదారులకు తమ బ్యాంక్ ఖాతాలను ఇచ్చి నగదును డిపాజిట్ చేయించుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ ప్రసాద్ రావు, ఎస్సై అభిషేక్, ఎఎస్సై హరిరామ్, హెచ్‌సి శ్రీనివాస్, పిసిలు సతీష్, భాస్కర్, మురళి, నవీన్, క్రాంతి, వెంకటేష్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News