Sunday, December 22, 2024

చందానగర్‌లో భార్య గొంతుకోసిన భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అనుమానంతో భార్య గొంతు భర్త కోసిన సంఘటన హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జగన్నాథం(50), తులసి(45) అనే దంపతులు చందానగర్‌లో నివసిస్తున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో ఇద్దరికి సర్ధి చెప్పినప్పటికి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తోంది.

ఓల్డ్ ఎఐజి కాలనీలో కర్రీ పాయింట్ నడిపిస్తూ తులసి జీవనం సాగిస్తోంది. భర్త పగతో రగిలిపోయాడు. బుధవారం రాత్రి ఆమె ఇంటికి వచ్చి ఆమె గొడవకు దిగాడు. ఘర్షణ తారా స్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని ఆమె గొంతు కోసి పారిపోయాడు. బాధితురాలి అరుపులు వేయడంతో స్థానికులు స్పందించి వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News